శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Sat Jul 22, 2023 7:40AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారిని 71వేల 721 మంది దర్శించుకున్నారు.
32 వేల 78 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 88 లక్షల రూపాయలు వచ్చింది.
ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నభక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయటి వరకూ క్యూలైన్ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


