శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు
Published on: Mon Jul 17, 2023 8:49AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని 86 వేల 170 మంది దర్శించుకున్నారు. 31 వేల 128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 13 లక్షలు వచ్చింది. ఇక సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


