తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Published on: Tue Jul 4, 2023 9:34AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జులై 3) శ్రీవారిని మొత్తం 66 వేల 77 మంది భక్తులు దర్శించుకున్నారు.
29 వేల 193 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.


