TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బద్రి నారాయణుడి అలంకారంలో మలయప్పస్వామి

Published on: Tue Sep 30, 2025 12:26PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన మంగళవారం (సెప్టెంబర్ 30)  ఉదయం స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా, కన్నులపండువగా సాగింది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.  అలాగే బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం (అక్టోబర్ 1)న శ్రీవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.