TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒకసారి దర్శించుకోవాలి

Published on: Mon Jul 28, 2025 3:25PM

 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇవాళ  శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని వెంకయ్యనాయుడు తెలిపారు. 

ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదని ఆయన తెలిపారు.  హిందువుల సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలి. ప్రముఖ దేవాలయాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పట్టాలి అని పిలుపునిచ్చారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం. గుడి కట్టించడం భక్తులు మరియు ప్రముఖ దేవస్థానాల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి అని మాజీ ఉప రాష్ట్రపతి తెలిపారు. అంతకముందు వెంకయ్యనాయుడు  సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. 

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్‌‌లు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.