తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Sep 13, 2025 10:52AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే టోకెన్లు ఉన్న భక్తులకు 4 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని తెలిపింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక నిన్న శుక్రవారం 69,842 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పించారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.


