TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరో క్రికెట్ పండుగకు వేళాయె.. 2027 వరల్డ్ కప్ తేదీలు ఖరారు

Published on: Fri Jun 12, 2026 9:03AM

ప్రపంచవ్యాప్తంగా   కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీపీ) థ్రిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డు వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించింది.  2027 అక్టోబర్ 4వ తేదీన ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ..  నవంబర్ 21వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీని   దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.  24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే 2003 నాటి చారిత్రాత్మక ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఆఫ్రికా గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరగడం ఇదే తొలిసారి. 

ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 54   మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఇందులో సింహభాగం మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా  వేదికగా నిలవనుంది. మొత్తం 54 మ్యాచ్‌లలో దాదాపు 41 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా మైదానాల్లోనే జరగబోతున్నాయి. మరోవైపు జింబాబ్వే మూడు  వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్‌లను నిర్వహిస్తుంది.  

ఈ సారి వరల్డ్ కప్ ఫార్మాట్‌లో ఐసీసీ భారీ మార్పులు  చేసింది.  ఎడిషన్లలో (2019, 2023) కేవలం 10 జట్లతోనే టోర్నీ నిర్వహించగా, ఈసారి  టోర్నీలో 14 జట్లు పాల్గొంటాయి.  14 జట్లనూ  రెండు గ్రూపులుగా విభజించి.. లీగ్ దశ ముగిసిన తర్వాత, ప్రతి గ్రూప్ నుండి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్-3 జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు పూర్తిస్థాయి సభ్య హోదా ఉన్నందున నేరుగా టోర్నీలోకి ప్రవేశం లభిస్తుంది. కానీ నమీబియా మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్లు ఆడి, గెలిచి ఈ టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది.