TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుబ్బిరామిరెడ్డికి నెల్లూరు లోక్ సభ టిక్కెట్టు

Published on: Mon Apr 16, 2012 12:14PM

నెల్లూరు లోక్ సభకు జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ కేంద్రమంత్రి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది. సుబ్బిరామిరెడ్డికి టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉందని రెండు వారాల క్రితమే తెలుగువన్.కామ్ తెలిపిన విషయం విదితమే. నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం పారిశ్రామితవేత్త సి.వి.ప్రసన్నరెడ్డికి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో జరగబోయే లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పారిశ్రామికవేత్తలకే టిక్కెట్లు ఇచ్చినట్లు అవుతోంది. కొవ్వూరు ఉప ఎన్నికల్లో ఓడిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో తన వ్యూహాన్ని మార్చుకుంది.

అందుకే అర్థబలం పుష్కలంగా ఉన్న సుబ్బిరామిరెడ్డి, ప్రసన్నరెడ్డి పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించింది. డబ్బున్న అభ్యర్థులు ఎన్నికల్లో ఓటర్లను తమదైన శైలిలో ప్రభావితం చేయటంతో పాటు పార్టీలోని అసంతృప్తవాదులను సంతృప్తిపరచగలరని పార్టీ నాయకత్వం భావిస్తోంది. సుబ్బిరామిరెడ్డి విషయానికి వస్తే 1943లో నెల్లూరులో జన్మించిన ఆయన 1996, 1998 లోక్ సభ ఎన్నికల్లో విశాఖనుంచి ఎన్నికయ్యారు. 2002 నుంచి మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2006-2008 మధ్య ఆయన కేంద్ర గనులశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2004లో టి.టి.డి. బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు.