TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

90 గ్రామాలను వణికిస్తున్న టైగర్ జొన్?

Published on: Wed Apr 25, 2012 1:04PM

ఖనిజసంపాదకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ జొన అన్నపదం 90 గ్రామాలను వణికిస్తోంది. ఆ గ్రామాలు ఈ జొన్ ఏర్పాటు కోసం ఖాళీ చేయాల్సి వస్తుంది. ఈ జొన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 45 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ఈ జొన్ ప్రతిపాదన వెనుక ఖనిజ సంపదను దోచుకునే ఆలోచనలున్నాయని అనుమానాలు ప్రబలుతున్నాయి. ఈ జొన్ పుణ్యమా అని వేలాది ఎకరాల సాగుభూమి బీడువారుతుంది. 60 వేల కుటుంబాలను ఈ జోన్ నుంచి దారుణంగా తరలించాల్సి వస్తుంది.

 

 

ఇక్కడ లభించే అమూల్యమైన ఈ ఖనిజాలను సొంతం చేసుకునే ఆలోచనలతోనే ప్రజాప్రతినిధులూ, అధికారులూ సంయుక్తంగా ఈ జోన్ కు వ్యూహరచన చేశారన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ జోన్ వల్ల జరిగే నష్టాలను వెల్లడి చేసేందుకు తెలంగాణా విద్యార్థి వేదిక నడుం బిగించింది. పల్లెపల్లెకూ తిరిగి వివరాలను గ్రామస్తులకు తెలియజేస్తామని వారు అంటున్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్తు కూడా ఇదే విషయమై జిల్లాలో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో పలు చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టింది.