TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మత్స్యకారుల వలకు చిక్కిన పులిమచ్చల టేకు చేప

Published on: Mon Sep 15, 2025 10:09AM

సముద్రం అంటేనే మత్స్య సంపదకు నిలయం. నిత్యం మత్స్యకారుల వలలకు ఎన్నో రకాల చేపలు  చిక్కుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అత్యంత అరుదైన, భారీ చేపలు కూడా మత్స్యకారుల వలలో పడుతుంటాయి. అలాంటి అరుదైన భారీ చేప కోససీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో మత్స్యకారులకు చిక్కింది.

ఈ చేప రూపంలోనే కాదు.. సైజులోనూ భారీయే. ఈ చేప పేరు పులి మచ్చల టేకు చేప అని మత్స్యకారులు తెలిపారు. దీని ఒంటిపై పులిమచ్చలు ఉంటాయి. దీని బరులు పది కిలోకలకు పైనే.  ఈ చేప పొట్టభాగంలోని బ్లాడర్ లో అత్యంత అరుదైన ఔషధ గుణాలు ఉండటంతో దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ చేపలు  నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూనే ఉంటాయి. అందుకే ఇది అప్పుడప్పుడు మత్స్యకారుల వలలకు చిక్కి వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంటాయి.