TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాదాద్రి జిల్లాలో పులి సంచారం.. అటవీ శాఖ ఏం చెప్పిందంటే?

Published on: Mon Jan 19, 2026 11:41AM

యాదాద్రి భువనగిరి జిల్లాలో   పులి సంచారం కలకలం రేపింది.  తుర్కపల్లి మండలం పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో ఓ పొలం వద్ద లేగదూడపై పులి దాడి చేసి చంపేంది. ఈ ఘటనతో పరిసర గ్రామాలప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారం  నేపథ్యంలో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్‌జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు.

రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్ల వద్దని సూచించారు. అలాగే పశువులను సురక్షితంగా ఉంచాలన్నారు. పులి కదలికలపై అటవీ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరలో పులిని బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామనీ, అంత వరకూ అప్రమత్తంగా ఉండాలనీ అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.