TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బాబోయ్ పెద్దపులి.. విద్యాసంస్థలకు సెలవు.. ఎక్కడంటే?

Published on: Mon Feb 2, 2026 12:44PM

పెద్దపులి భయంతో రాజమండ్రి రూరల్ మండలం వణికి పోతున్నది. తొర్రేడులో జనావాసాలకు అతి సమీపంలోని అరటి తోటలలో పెద్ద పులి సంచారాన్ని గుర్తించిన స్థానికులు భయంతో బెంబేలె త్తిపోతున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పెద్దపులిని పట్టుకునేందుకు రెండు బోనులు ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

మండల పరిధిలో పెద్దపులి సంచరించే అవకాశాలున్నాయని భావిస్తున్న  సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ ప్రాంతాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లని హెచ్చరిక జారీ చేశారు. జనం ఒంటరిగా తిరగవద్దనీ, గుంపులు, గుంపులుగా మాత్రమే సంచరిం చాలనీ ఫారెస్టు అధికారులు హెచ్చరించారు. ఇలా ఉండగా ముందు జాగ్రత్తగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.