TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ‌లో పిడుగుల వ‌ర్షం.. హైద‌రాబాద్‌కు హైఅల‌ర్ట్‌..

Published on: Mon Jan 10, 2022 5:36PM

10.01.2022. సోమ‌వారం రాత్రి తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. ఇదేదో అల్లాట‌ప్పా వార్నింగ్ కాద‌ని.. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఒకింత గ‌ట్టిగానే సూచించింది. 

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్‌, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందట‌. పలు చోట్ల వడగళ్లు ప‌డ‌తాయ‌ని.. పిడుగులు ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ప‌క్కాగా చెబుతోంది వాతావ‌ర‌ణ శాఖ‌. తెలంగాణ జిల్లాల‌నే కాదు.. హైదరాబాద్‌లోనూ పిడుడులతో కూడిన వర్షం కుర‌వ‌నుంద‌నేది వెద‌ర్ అల‌ర్ట్‌. తెలంగాణ‌వాసులు పూర్తి అప్ర‌మ‌త్త‌త‌తో ఉండాల‌ని చెబుతున్నారు.

బుధ‌వారం సైతం ఆదిలాబాద్‌, కొమురం భీం‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వాన‌లు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. 

పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు పొడ‌వైన‌ చెట్లు, ఎత్త‌న ట‌వ‌ర్ల స‌మీపంలో ఉండ‌క‌పోవ‌డం మంచిది. వాన ప‌డుతూ, ఉరుములు, పిడుగులు ప‌డుతుంటే.. ఇంట్లోని ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాలు ఆఫ్ చేయాల‌ని.. క‌రెంట్‌ ప్ల‌గ్‌ల నుంచి డిస్‌క‌నెక్ట్ చేయాల‌ని చెబుతున్నారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.