ముగ్గురి హత్య... హనుమాన్జంక్షన్ దగ్గర కారు దొరికింది..
Published on: Wed Sep 24, 2014 10:35PM
.jpg)
కృష్ణా జిల్లాలోని అవుటుపల్లి సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో దుండుగులు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. హనుమాన్ జంక్షన్ వద్ద ఈ కారు లభించింది. హత్య చేసిన దుండగులు మూడు రోజులుగా హనుమాన్ జంక్షన్లోని రాయల్ హంపీ హోటల్లో బస చేశారు. ఓ కారుకు బైక్ నెంబరు వేసి దుండగులు ఉపయోగించారు. కాల్పులు జరిగిన తర్వాత హనుమాన్జంక్షన్లోని హోటల్ వెనకాల కారును వదిలి హంతకులు పరారయ్యారు. పాతకక్షల కారణంగానే హత్యలు జరిగాయని విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. మృతులు చిన్న కడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి మారయ్య, నాగేశ్వర రావు, గంధం మారయ్య ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు డ్రైవర్ ఏలూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. హత్య జరిగిన స్థలంలో పోలీసులు 5 తుటాలు స్వాధీనం చేసుకున్నారు.


