TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Published on: Fri Jun 5, 2026 9:52AM

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంప్రమాదం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.  కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ప్రముఖ కోళ్ల వ్యాపారి గజేశ్వర్ రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి ప్రయాణిస్తున్న కారు  ప్రమాదానికి గురైంది.

గురువారం(జూన్ 4) కర్ణాటక తుమకూరు జిల్లా, చిక్కనాయకనహళ్లి తాలూకా పరిధిలోని హులియారు వద్ద  వేగంగా వెళ్తున్న రెండు కార్లు  ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ  ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు గజేశ్వర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న గజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య,   కుమార్తె ముగ్గురూ  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 ఈ ప్రమాదంలో రెండో కారులో ప్రయాణిస్తున్న వారికి సైతం  గాయాలయ్యాయి. సమాచారం అందుకుని  ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి  విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.