సినిమాటిక్ మర్డర్: ముగ్గురి హత్య
Published on: Wed Sep 24, 2014 10:55AM
.jpg)
మనం సినిమాల్లో చూసే మాఫియా తరహా హత్యలు కృష్ణాజిల్లాలో జరిగాయి. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుట్లపల్లి దగ్గర జాతీయ రహదారి మీద ఒక కారు రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఒక మారుతీ వ్యాన్ ఆ కారు దగ్గరకి దూసుకువచ్చింది. మారుతీ వ్యాన్లో వున్న దుండగులు ఆ కారు మీదకు కాల్పులు జరిపారు. దాంతో కారు ఆగిపోయింది. మారుతీ వ్యాన్లో వున్న దుండగులు కారులో వున్న ముగ్గురినీ దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. హతులు ఎవరు, హంతకులు ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు.


