ఏపీకి కార్యాలయాల తరలింపుపై కమిటీ
Published on: Sat Sep 13, 2014 5:10PM
.jpg)
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి శాఖాధిపతుల కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీలో ఆర్థిక, రవాణా, మునిసిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు వున్నారు. ఈ కమిటీ 15 రోజులలోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి? భవనాల లభ్యత, అద్దెలు ఎలా వుంటాయనే విషయం మీద ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.


