TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో భారీ క్రేన్ కూలి నలుగురు మృతి

Published on: Mon Apr 27, 2026 7:03PM

 

హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎన్‌సీసీ నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాణ స్థలంలో పనిచే స్తున్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

సాక్షుల కథనం ప్రకారం ఈరోజు సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గాలి, వర్షం తీవ్రంగా ఉండగా భారీ క్రేన్ సడన్‌గా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపో యింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికు లపై క్రేన్ శిఖరాలు పడటం తో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో  పది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే లలిత హాస్పిటల్‌కు  తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణ ప్రదేశంలో మొత్తం 13 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. క్రేన్ శిథిలాల కింద ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ శకలాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. మృతులు మరియు గాయాలైన వారు కార్మికులు బీహార్, చత్తీస్గడ్,  అస్సాం కు చెందిన వారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.