రాదే శ్యాం ప్రీ రిలీజ్ పంక్షన్ లో ఉద్రిక్తత..
Published on: Thu Dec 23, 2021 8:42PM
హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న రాదే శ్యాం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఫంక్షన్ కు లెక్కకు మించి హీరో ప్రభాష్ ఫ్యాన్స్ తరలివచ్చారు. వాళ్లను కంట్రోల్ చేయడం నిర్వాహకులకు కష్టంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్ పైకి భారీగా ఎక్కారు అభిమానులు. కెపాసిటికి మించి ఎక్కడంతో కటౌట్ కూలిపోయింది. కటౌట్ కింద పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంంగా ఉందని చెబుతున్నారు. ప్రభాష్ అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.


