ఈతకు వెళ్ళి ముగ్గురు బాలికల మృతి
Published on: Mon Sep 22, 2014 5:16PM

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఈతకు వెళ్ళిన ముగ్గురు బాలికలు నీట మునిగి మరణించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలం కొడిచర్ల గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. కొడిచెర్లలోని చెరువులో ఈత కొట్టడానికి మమత (14), నమ్రత (10), నిఖిత (8) అనే ముగ్గురు చిన్నారులు వెళ్ళారు. అయితే చెరువు బాగా లోతుగా వుండటం, ముగ్గురు బాలికలకూ ఈత రాకపోవడంతో నీట మునిగి మరణించారు.


