TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

Published on: Sat Sep 27, 2025 10:03AM

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి.

అయినా ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటో నడుపుతూ  కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందినసత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు.