TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

3 రోజులుగా త‌గ్గుతున్న కేసులు.. పాజిటివిటీ రేటు 10శాతం లోపే..

Published on: Wed Feb 2, 2022 10:28AM

హ‌మ్మ‌య్యా. కాస్త రిలాక్స్ ఇచ్చే న్యూస్ ఇది. త‌గ్గేదేలే అంటూ పెరుగుతూ వ‌చ్చిన పాజిటివ్ కేసులు.. గ‌త మూడు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గుడ్‌న్యూస్‌. వ‌రుస‌గా రెండో రోజు కొత్త కేసుల సంఖ్య 2 ల‌క్ష‌ల‌కంటే త‌క్కువ‌గా న‌మోదయ్యాయి. ఇక‌, క‌రోనా పాజిటివిటీ రేటు మ‌రింత భారీగా ప‌త‌న‌మై.. 10శాతంకంటే దిగువ‌కు దిగొచ్చింది. తాజా, గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోందని తెలుస్తోంది. 

మంగళవారం 17 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జ‌రిగాయి. వారిలో 1,61,386 మందికి వైరస్‌ సోకింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతానికి తగ్గిపోయింది. ఒక్క‌రోజులోనే 2,81,109 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95 శాతానికి సమీపించగా.. క్రియాశీల రేటు 4 శాతం దిగువకు చేరింది.  

మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతూ పోతుండ‌ట‌మే కాస్త ఆందోళ‌న‌క‌ర అంశం. సోమ‌వారం మృతుల సంఖ్య 1192గా ఉండగా.. మంగ‌ళ‌వారం 1,733 మరణాలు నమోదయ్యాయి. ఎప్ప‌టిలానే ఈసారి కూడా కేర‌ళ‌లోనే అధిక మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అక్క‌డ‌ మృతుల సంఖ్యే 1,205గా ఉంది.