భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
Published on: Tue Oct 7, 2025 5:29PM

భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్ సైంటిస్టులకు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైఖేల్ హెచ్ డెవోరెట్‌లకు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ వరించింది. క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధనలకు గాను ఈ పురస్కారం లభించింది.
ఈ విషయాన్ని ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మైక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ చేసినందుకు గానూ జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లను నోబెల్ పురస్కారం వరించింది. డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాల ప్రదానం జరగనుంది. అన్ని డిజిటల్ టెక్నాలజీలకు క్వాంటం మెకానిక్సే పునాది కనుక వీరి పరిశోధనలు క్వాంటం కంప్యూటర్లు, క్వాంటం సెన్సార్లు, క్వాంటం క్రిప్టోగ్రఫీ వంటి భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు.


