కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Published on: Fri Jun 14, 2019 11:53AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతుండటంతో కిషన్ రెడ్డి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్న దానిపై నిఘా పెట్టారు. అదే సమయంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. నిఘా పటిష్టం చేశారు.


