1000 రోజులు- 1000 నేరాలు.. జగన్ ప్రభుతంపై 'ప్రజా ఛార్జిషీట్'
Published on: Wed Mar 9, 2022 4:28PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఈ వెయ్యి రోజుల పాలనలో వెయ్యికి పైగానే ,నేరాలు,ఘోరాలకు పాల్పడిందని, ప్రతిపక్షాలే కాదు, ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపించండమే కాదు, జగన్ రెడ్డి వెయ్యి రోజుల విద్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ‘ప్రజా ఛార్జి షీట్’ను విడుదల చేశారు. నిజానికి ఈ ఛార్జి షీట్’లో ప్రజలు చేసిన అభియోగాలు ఏవి కూడా కొత్తగా చేసినవి కాదు. అసత్యాలు అసలే కాదు. అందరికీ అనుభవంలో ఉన్న, సర్కార్ నేరాలు, ఘోరాలు,విద్వంసాలు, ద్వంస రచనలు ఇతరేతర అకృత్యాలనే, ‘ప్రజా ఛార్జి షీట్’లో చేర్చారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తొలి అడుగు నుంచి మొదలు పెడితే, ప్రతి అడుగులో విద్వంసమే కనిపిస్తుంది అనేది ఛార్జి షీట్’ లోని తొలి అభియోగం. అది నిజం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ముందుగా చేసిన పని, ‘ప్రజావేదిక’ ను కూల్చి వేయడం. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ రెడ్డి ప్రభుత్వం ద్వంస రచన ఈరోజు వరకూ అలాసాగుతూనే వుంది. ఒక్కసారి వెనక్కి వెళ్లి, ఒక్కొకటి గుర్తుచేస్కుంటే, జగన్ రెడ్డి వెయ్యి రోజుల పాలన, నవ్యాంధ్రను నవ్వులపాలు చేసిని వైనమే కనిపిస్తోందని, ‘ప్రజా ఛార్జి షీట్’ ఆరోపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి విద్వంస విదానాల కారణంగానే, లక్షలాది మందికి, ఉపాధి కల్పించే 139 సంస్థలు, ప్రజా రాజధాని అమరావతి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయని, ‘ప్రజా ఛార్జి షీట్’ పేర్కొంది. అదే విధంగా, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విషయంలో వేసిన తప్పటడుగులు వేసింది.తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా రూ. 2లక్షల కోట్ల అస్తులను నిరర్ధకంగా మిగిలాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన రాజధాని ప్రాంతం, ఆ ప్రాంత రైతులు, ప్రజలు మాత్రమే కాదు, రాష్ట్రమే నష్ట పోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాలు, 175 నియోజకవర్గాల వర్గాలలో అభివృద్ది ఆగిపోయింది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు, ఆస్తులు ఉన్నా అనుభవించలేని పరిస్థితి ఏర్పడింది. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రైతులపై దుష్ప్రచారం సాగిస్తోందని ‘ప్రజా ఛార్జి షీట్’ ఆరోపించింది. అంతే కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం, అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించిన ప్రజా రాజధాని అమరావతి విషయంలో అనవసర వివాదాన్ని సృష్టించి, మీ రాష్ట్ర రాజధాని ఏదంటే, రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని దుస్థితిని సృష్టించందని, ‘ప్రజా ఛార్జి షీట్’ ఆరోపించింది. ఈ దుస్థితి నుంచి ప్రజలను బయట పడేసే విధంగా, రాష్ట్ర హై కోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. అయినా, ఇప్పటికీ రాష్ట్ర మంత్రులు కోర్టు తీర్లును దిక్కరించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, ‘ప్రజా ఛార్జి షీట్’ ఆరోపించింది.
జగన్ రెడ్డి ప్రభుత్వం 1000 రోజులలో, ప్రజలకే కాదు దేవునికి కూడా రక్షణ లేకుండా పోయిందని ‘ప్రజా ఛార్జి షీట్’ పేర్కొంది. ఈ వేయి రోజులలో 226 దేవాలయాలపై దాడులు జరిగాయి. రామతీర్థంలో శ్రీరామచంద్ర మూర్తి విగ్రహం తలను దుండగులు నరికేశారు. అయినా ఇంతవరకు ఎవరిమీద ఎలాంటి చర్యలు తీసుకో లేదని, ‘ప్రజా ఛార్జి షీట్’ పేర్కొంది.
అలాగే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి నివాసంపై వైసీపీ శాసన సభ్యులు చేసిన దాడి, సృష్టించిన విద్వంసం, టీడీపీ అధికార ప్రతినిధి నివాసం పై దాడి, విద్వంసాలను ‘ప్రజా ఛార్జి షీట్’ ప్రముఖంగా ప్రస్తావించింది. అదే విధంగా కియా పరిశ్రమపై దాడి కారణంగా 16 అనుబంధ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి పోయిన వైనాన్ని,, అదే విధంగా, మైలవరం సోలార్ ప్లాంట్ పై దాడి, గీతం యూనివర్సిటీ భవనాలను రాజకీయ కారణాలతో కూల్చివేసిన సంఘటనను, రాష్ట్రంలో పలు చోట్ల అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాల ద్వంస రచనను, ‘ప్రజా ఛార్జి షీట్’ ప్రస్తావించింది.


