న్యూ ఇయర్ జోష్.. వెయ్యి కోట్ల మద్యం తాగేశారు!
Published on: Mon Jan 2, 2023 12:14AM
తెలంగాణలో కొత్త సంవత్సరం జోష్ అవధులు దాటేసింది. మందు బాబులు ఏకంగా వెయ్యి కోట్ల కు పైగా విలువ చేసు మద్యం తాగేశారు. ఔను.. కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల కోట్ల కు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి.
డిసెంబర్ చివరి వారంలోనే ఈ మేరకు మద్యం విక్రయాలు జరిగాయంటే న్యూఇయర్ కు మద్యం ఏరులై పారిందనే చెప్పాలి. ఒక్క డిసెంబర్ 30, 31 తేదీలలోనే 470 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో సగటున రోజుకు 180 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజులలో ఇది కేవలం 70 కోట్లు మాత్రమే ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా సర్కార్ మద్యం విక్రయ వేళలను పెంచడంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయని చెప్పాలి.


