TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ ఏడు తెలుగుదేశం మహానాడు నెల్లూరులో

Published on: Thu Apr 30, 2026 12:27PM

తెలుగుదేశం పండుగ మహానాడు ఈ ఏడాది నెల్లూరులో జరగనుంది. తొలుత మహానాడును శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని పార్టీ భావించింది. శ్రీకాకుళం జిల్లా   చాపురం లో వచ్చే నెల 27, 28, 29 తేదీలలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

మే చివరిలో పార్టీ మహానాడును నిర్వహించిన తరువాత స్వల్ప వ్యవధిలో మోడీ ఉత్తరాంధ్రపర్యటనకు ఏర్పాట్లు, జనసమీకరణ, భద్రతా ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయన్న భావనతో వేదిక మార్పునకు పార్టీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అదలా ఉండగా ఇప్పటికే  మహానాడు వేదిక మార్పుకు సంబంధించి  తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్  శ్రీకాకుళం, నెల్లూరు పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అలాగే నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నెల్లూరు నేతలను ఆయన ఆదేశించారని చెబుతున్నారు.