TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ దీవి ఖ‌రీదు రూ.3 కోట్లు!

Published on: Wed Aug 17, 2022 2:23PM

మంచి క‌ల‌ర్‌ఫుల్ కార్డు, అంత‌కుమించి క‌ళ్ల‌ను ఇట్టి క‌ట్టిప‌డేసే బంగ్లా బొమ్మ చూడంగానే ఢామ్ ప‌డేసేట్టు ఉంటుంది. కార్డు ఫోర్డు తెర‌వ‌గానే అది ఎక్క‌డున్న‌దీ చుట్టుపక్క‌లేమున్న‌దీ అన్నివివ‌రాలూ ఉంటాయి. చూస్తున్నంత‌సేపూ స‌ద‌రు రిప్ర‌జంటేటివ్ కామెంట్రీతో ఊద‌ర‌గొడ‌తాడు.. ఇదీ రియ‌ల్ ఎస్టేట్ వారి ప్ర‌చార ప‌ద్ధ‌తి. కొన‌బోతే జీవితంలో ఏదో న‌ష్ట‌పోతారన్న స్థాయిలో భ‌య‌పెడ‌తారు. 

ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ప్ర‌చారాలు, కొనుగోళ్లు, అమ్మ‌కాలు జ‌రిగిపోతున్నాయి. అదీ ఒక్క ఫ్లాట్ లేదా విల్లా గురించిన హ‌డావుడి. కానీ చిత్రంగా ఏకంగా ఒక దీవి కోస‌మూ ఇదే స్థాయి ప్ర‌చారం జ‌రుగుతోంది. కేవ‌లం మూడు కోట్లు చెల్లిస్తే ప్ల‌డ్డా ఐలెండ్ మీ సొంతం అంటున్నారు!

ఈ ద్వీపంలో ఐదు బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉంది, ఒక హెలిపాడ్, ఒక లైట్ హౌస్ ఉంది. ఇదేమీ ఈమ‌ధ్య నాటి ది కాదు. ఏకంగా 1790ల్లోది! ఎంతో ప్ర‌శాంతంగా బ్ర‌హ్మాండంగా ఉన్న ఈ ద్వీపం ఖ‌రీదు ముంబైలో 3 బి హెచ్‌కె ఖ‌రీదు కంటే త‌క్కువేన‌ట‌! మొత్తం 28 ఎక‌రాల ఈ ద్వీపం చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంది. ఎవరూ ఇక్క‌డికి వెళ్ల‌డం, ఉండ‌టం జ‌ర‌గ‌లేదు. అయితే ముప్ప‌య్యేళ్ల క్రితం దీన్ని ఆరాన్ ఎస్టేట్ వారు అమ్మేశారు. దీన్ని డెరిక్, సాలీ మార్ట‌న్ అనే డిజైన‌ర్లు కొన్నారు. 

క‌నుక ప్ర‌స్తుతం వారిద్ద‌రూ దీని య‌జ‌మా నులు. ఈ ద్వీపం స‌రిగ్గా గ్లాస్గో నుంచి 31 మైళ్ల దూరంలో ఉంది. ఆర్డొస్సాన్ నుంచి ప‌డ‌వ‌లో ఇక్క‌డికి చేరు కోవ‌చ్చు. ఈ ద్వీపంలో వంద‌కు పైగా ర‌కాల ప‌క్ష‌లు ఉన్నాయి. కాగా లైట్ హౌస్‌ని 1990 నుంచి ఎడిన్‌బ‌ర్గ్ నిర్వ‌హిస్తోందిట‌. పురాత‌న‌ప‌ద్ద‌తిలో అద్దం, నూనె దీపం తీసేసి వాటి స్థానంలో సోలార్ శ‌క్తి తో న‌డిచే ఎల్ ఇ డి లైట్లు అమ‌ర్చారు.