TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెప్పు తెగే వరకు కొడతా..కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on: Sat Aug 9, 2025 9:35PM

 

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని ఎ. కొండూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడకల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి కొలికపూడి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎ. కొండూరు మండలంలో వాటర్ సరఫరాపై జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిముఖ్య అనుచరుడిని టార్గెట్ చేశారు కొలికపూడి. గిరిజనులకు మరుగుదొడ్లు కట్టించేందుకు గతంలో కాంట్రాక్ట్‌ తీసుకున్న టీడీపీ నేత రమేష్‌రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 320 మరుగుదొడ్లు కట్టించేందుకు బిల్లులు తీసుకున్నారన్నారు. అటువంటి వారి వెనుక  తిరుగుతారా? అంటూ గిరిజనును నిలదీశారు. అసలు మీకు సిగ్గుందా? గిరిజనులపై సైతం నోరు పారేసుకున్నారు కొలికపూడి.