డాలర్ల విక్రయానికి టిటిడి మంగళం?
Published on: Thu Mar 1, 2012 11:48AM
తిరు
పతి: భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంగళం పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో డాలర్ల విక్రయంలో అవినీతి చోటుచేసుకోవడంతో టిటిడిపై విమర్సలొచ్చాయి. ఆ తరువాత బంగారం, వెండి రేటు రోజురోజుకూ పెరుగుతుండడంతో వీటి ధర నిర్ణయం విషయం కూడా టిటిడి అధికారులకు చికాకులు కలిగిస్తోంది. ఇప్పటికే వెండి డాలర్ల తయారీని దేవస్థానం తగ్గించినట్లు తెలుస్తోంది. భక్తులు కానుకలుగా సమర్పించిన బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వడ్డీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ-వేలం ద్వారా వెండి నిల్వలను విక్రయించాలని టిటిడి సంకల్పించింది. ఈ నేపధ్యంలో డాలర్ల తారీపై దేవస్థానం మొగ్గు చూపడం లేదు. శ్రీవారి డాలర్లను భక్తులు పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తారు. ఇతరులకు బహుమానంగా కొనుగోలుచేసి ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఈ అవకాశం త్వరలో కనుమరోగయ్యే పరిస్థితి ఏర్పడింది.


