TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేవుడికి హారతి ఇవ్వద్దు

Published on: Wed Feb 22, 2012 3:01PM

టిటిడికి పురావస్తుశాఖ సలహా   
తిరుపతిలో టిటిడి-పురావస్తుశాఖ మధ్య కోల్డ్ వార్
తిరు
పతి:  తిరుపతిలో  శ్రీనివాస మంగాపురం ఆలయం టిటిడి-పురావస్తు శాఖల వివాదాలకు వేదికగా మారింది. ఆలయంలో దేవుడికి హారతీ ఇవ్వద్దు, భక్తుల సదుపాయాల పేరుతో ఎక్కడ పడితే అక్కడ గోడలు పడగొట్టడం, కట్టడం చేయవద్దు అని పురావస్తుశాఖ టిటిడికి అభ్యంతరాలు చెబుతుంది.శ్రీనివాస మంగాపురం ఆలయం టిటిడి పరిధిలో ఉన్నప్పటికీ అది పురావస్తు శాఖ అధీనంలో ఉండటంతో దేవస్థానం ఏ పనిచేయాలనుకున్నా చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఆ మేరకు అభివృద్ధి పనులు చేయాలంటే టిటిడికి సమస్యగా మారింది.ఆలయంలో మేకు కొట్టాలన్నా పురావస్తుశాఖ అనుమతికోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయంలో దేవుడికి హారతులిస్తే గోడలు మసిబారడంతోపాటు దెబ్బతినే ప్రమాదం ఉందని పురావస్తుశాఖ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో పూజారులు విస్తుపోతున్నారు.