TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో బైక్ రేసులు..అప్రమత్తమైన పోలీసులు

Published on: Mon Feb 20, 2012 1:15PM

తిరుపతి: ఇప్పటివరకు హైదరాబాద్ కు పరిమితం అనుకుంటున్న బైక్ రేసులు ఇప్పుడు తిరుపతిలో కూడా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలో విద్యార్ధులతో పాటు తిరుపతిలోని ధనవంతుల బిడ్డలు కూడా ఖరీదైన, శక్తివంతమైన బైకులతో రేసులు నిర్వహిస్తూ జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన ఇటువంటి రేసులో ప్రమాదం జరిగి ఇద్దరు కుర్రాళ్ళు మృతిచెందారు. దీనితో పోలీసులు అప్రమత్తమైన రేసుల జోరు నియంత్రించడానికి నడుం బిగించారు. జిల్లాలో 150, 180, 220 సిసి ద్విచక్ర వాహనాలే కాకుండా 250, 350, 500 సిసి ద్విచక్ర వాహనాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. విదేశీ వాహనాలు ఇరుకుగా, నిత్యం రద్దీగా ఉండే మన రోడ్లకు సరిపోక పోయినా పిల్లల ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులు కొనిస్తూ ప్రమాదాలను కొనితెస్తున్నారు. బైక్ రేసులు పెరగడంతో చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.