TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోపిదేవిపై ఆరోపణలను కొట్టిపారేసిన చిరంజీవి

Published on: Thu Feb 9, 2012 10:15AM

తిరుపతి: ముడుపులు తీసుకున్నారంటూ మోపిదేవి వెంకట రమణపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని తిరుపతి శాసనసభ్యుడు  చిరంజీవి కొట్టి పారేశారు. గురువారం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రుల మధ్య సమన్వయానికి కృషి చేస్తామన్నారు. శాఖల కేటాయింపులో కూడా సమన్వయం చేస్తామన్నారు. తిరుపతి నగర సమగ్రాభివృద్దికి రూ.405 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారన్నారు. కాగా బుధవారం సాయంత్రం చిరంజీవి, ముఖ్యమంత్రితో భేటీ అయిన విషయం తెలిసిందే. తిరుపతి అభివృద్ధి పనులపై చర్చించేందుకు రావాల్సిందిగా చిరంజీవిని సాయంత్రం సిఎం ఆహ్వానించారు. పక్కనే ఉన్న తన నివాసానికి తేనీరు సేవించేందుకు రావాలని చిరంజీవి సిఎంను పిలిచారు. తనతో ఉన్న సీనియర్ మంత్రి రఘువీరా రెడ్డిని కూడా తీసుకొని సిఎం.. చిరంజీవి నివాసానికి వెళ్లి సుమారు ఓ గంట పాటు చర్చించారు.