TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిన్నజీయర్ పై టిటిడి ఈవో ఘాటైన వ్యాఖ్యలు

Published on: Sat Feb 4, 2012 1:59PM

తిరుమల: తిరుమలపై చిన్నజీయర్ స్వామి చేస్తున్న వ్యాఖ్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి (ఇవో) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను 110 తప్పులు చేసినట్లు నిరూపిస్తే తాను చేసిన 200 మంచి పనులు చూపిస్తానని అన్నారు. ఆలయానికి కళంకం తెచ్చినట్లు నిరూపిస్తే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక వ్యక్తి వ్యవస్థను నియంత్రించాలని అనుకోవడం సరైంది కాదని ఆయన చిన్న జీయర్ స్వామిని ఉద్దేశించి అన్నారు. వేయి కాళ్ల మండపానికి ఏ విధమైన చారిత్రక నేపథ్యం లేదని, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే దాన్ని ఉద్దేశించారని ఆయన స్పష్టం చేశారు. స్వామివారి కైంకర్యం విషయంలో పొరపాట్లు జరగకుండా చూడడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన అన్నారు. దేవాలయానికి మార్పులు చేయడం సాధ్యం కాదు కాబట్టి భక్తులకు సరైన దర్శనం కల్పించలేకపోతున్నామనే ఆవేదన తమలో ఉందని ఆయన అన్నారు. స్వామివారికి ఆగ్రహం వస్తే తానిలా నడవగలనా అని ఆయన అడిగారు.