బాలయ్యది పిల్లాడి మనస్తత్వం లక్ష్మి పార్వతి
Published on: Wed Jan 18, 2012 9:53AM
హైదరా
బాద్: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి చెప్పినట్లు నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లాడి మనస్తత్వమని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు, దివంగత నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి బుధవారం అన్నారు. ఎన్టీఆర్ పదహారవ వర్దంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. బాలయ్యది పిల్లాడి మనస్తత్వమేనన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాధరణ ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు.


