చిరువర్గానికి పదవులు దక్కే విషయంపై ఊహాగానాలకు తెర
Published on: Thu Jan 5, 2012 2:07PM
తిరుప
తి: తమ వారికి పదవులు ఇవ్వడానికి జరిగే మంత్రి విస్తరణపై కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు, గత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నోరు విప్పారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, అందులో తమ వారికి బెర్త్‌లు ఖాయమని చిరంజీవి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. కథ నచ్చితే ఈ ఏడాది సినిమా చేస్తానని ఆయన చెప్పారు. చిరంజీవి మాటతో మంత్రి వర్గ విస్తరణపై, ఆయన వర్గం శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కే విషయంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఇప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీకి పదవులు దక్కుతాయా, లేదా అనేది, దక్కితే ఎప్పుడు దక్కుతాయనేది సందేహంగా ఉంటూ వచ్చింది.


