తిరుమలకు వచ్చి మనసును బాధపెట్టుకుని వెళ్తున్నా మోహన్ బాబు
Published on: Thu Jan 5, 2012 11:28AM
తిరుప
తి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తీరుపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సారి తాను తిరుమలకు వచ్చి మనసును బాధ పెట్టుకుని వెళ్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని, అందువల్ల తాను ఏమీ మాట్లాడబోనని, తనను వదిలేస్తే సంతోషిస్తానని అంటూనే ఆయన టిటిడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిజాలే మాట్లాడుతాను కాబట్టి కొంత మందికి రుచించదని ఆయన అన్నారు. అయినా ఓ నిజం చెప్తానని అంటూ ఆయన విమర్శలు చేశారు. అయితే, ఓ పద్ధతి ఉండాలని మంత్రి టిజి వెంకటేష్ కూడా అభిప్రాయపడ్డారు. కొంత మందిని నేరుగా లోనికి అనుమతించడంపై, భక్తులను గంటల తరబడి ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి.


