స్మగ్లర్‌ల ఘాతుకం
Published on: Mon Dec 16, 2013 8:29AM

రాష్ట్రంలో స్మగ్లర్‌లు ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడటం లేదు. తమ పనులకి అడ్డు వస్తున్నారని పోలీసులను కిరాతకంగా చంపాడానికి కూడా సిద్దపడుతున్నారు. తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఇలాంటి ఘాతుకానికి తెగబడ్డారు. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ అధికారుల బృందంపై ఆదివారం ఉదయం మూకుమ్మడిగా దాడి చేసి ఇద్దరు అధికారులను హతమార్చారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు వంద మంది కూలిలు ఒకేసారి గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి ఇద్దరు ఆఫీసర్‌లను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడిలొ తిరుపతి వన్యప్రాణి అటవీ విభాగం తిరుమల శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్.ఆర్.శ్రీధర్ (50), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్(49) అక్కడికక్కడే మృతిచెందారు.


