TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో మూడో ప్రత్యామ్నాయం..?

Published on: Wed Jul 4, 2018 2:57PM

 

ఏపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది.. ఐతే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు, జనసేనతో కలిసి మహా కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నాయి..  కామ్రేడ్‌ నీలం రాజశేఖరరెడ్డి శతజయంతి సభ మంగళవారం విశాఖ లోని సీపీఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీలో టీడీపీ, వైసీపీలే ఎందుకు ఉండాలి.. మూడో ప్రత్యామ్నాయం ఎందుకు రాకూడదని ప్రశ్నించారు.. అలానే 'చంద్రబాబు దిగిపోతే సీఎం కుర్చీ ఎక్కాలని జగన్‌ రెడీగా ఉన్నారు.. కానీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి సీఎం అయితే.. అవినీతిపరులపై ఎలా చర్యలు తీసుకోగలరని రామకృష్ణ ప్రశ్నించారు.