TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హీరో రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు

Published on: Tue Sep 10, 2024 3:59PM

హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన  బంగారం  రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు  లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన  వాటిలో మంగళసూత్రం, బంగారం ఉన్నట్లు నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. తాను కొనుగోలు చేసిన జ్యువలరీ షాపు బిల్లులను లావణ్య పోలీసులకు సమర్పించారు. 
బీరువాలో దాచుకున్న బంగారం రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగారం విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ తరుణ్ హైకోర్టును కోరారు.  హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది.ఈ కేసు కొనసాగుతుండగానే రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు నమోదు కావడం  చర్చనీయాంశమైంది.