TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో పుట్టినరోజు నాడే మృతి చెందిన యువకుడు

Published on: Sun Apr 12, 2026 4:57PM

 

విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది. విజయనగరం జిల్లాకు చెందిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ అమెరికాలో జలపాతంలో మునిగి మృతి చెందిన ఘటన అందరి హృదయాలను కలచి వేసింది.. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పరిధిలోని పరిడి గ్రామంలో నివాసముండే హరికృష్ణ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ చూపిన ఆయన ఉన్నత చదువులపై దృష్టి పెట్టి అమెరికాకు వెళ్లారు. అక్కడ ఎమ్మెస్సీ ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, కష్టపడి కేవలం మూడు నెలల క్రితమే జనవరి నెలలో ఎలిసెంట్ క్లీన్ టెక్నాలజీ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించారు. 

కుటుంబానికి, గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ఈ విజయంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. నిన్న సాయి శ్రీ హరికృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో వేడు కలు జరుపుకున్నారు. అనంతరం సరదాగా ప్రకృతి సోయగాలను ఆస్వాదిం చేందుకు జలపాతం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ సరదాగా స్నానం చేయ డానికి నీటిలో దిగగా ఆయ నకు ఈత రాకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాసేపట్లోనే హరికృష్ణ గల్లంతయ్యాడు. అది గమనించిన మిగతా స్నేహితులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించగా, గాలింపు చర్యల అనంతరం ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.

పుట్టినరోజునే ఈ దుర్ఘటన చోటుచేసుకో వడం మరింత విషాదాన్ని కలిగించింది. విదేశాల్లో ఒంటరిగానే జీవితం ప్రారంభించిన యువకుడు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యు లను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ము కున్నాయి. ఉన్నత లక్ష్యాలతో విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అనుకోని ప్రమాదానికి గురవడం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. యువత జలపాతాలు, నదులు వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.... విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యువకుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు.. చిన్న వయసులో హరికృష్ణ అకాల మరణం కలిగించే వేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు హరికృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురా వడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి వెల్లడించారు.