TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెట్టెక్కిన చింతచిగురు ధర

Published on: Sat Jun 23, 2012 5:14PM

చింతచిగురు ఈ మాట తెలియని వారుండరు. సాంప్రదాయ వంటలకిది పెట్టింది పేరు. అది వెజిటేరియన్‌ కూరైనా , నాన్‌ వెజిటేరియన్‌ కూరలైనా కాస్తంత చింత చిగురు వేస్తే ఆ కూర రుచేవేరు. పప్పుచింత చిగురు, వంకాయ చింతచిగురు, ఇలా ఒకటేమిటి దేనిలోవేసినా దాని రుచేవేరు. ఇక నాన్‌వెజ్‌ వంటకాలకొస్తే చింతచిగురు మటన్‌ చింతచిగురు చికెన్‌ మహా పసందుగా వుంటుంది. కాని ఆహార ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ ...ఇదివరకటిలా రాష్ట్రంలో చింతచిగురు ఎక్కువగా దొరకటం లేదు. వ్యవసాయభూములకు, పండ్లతోటలకు రియల్‌ఎస్టేట్‌ తో వచ్చిన గండం వల్ల ఈ చెట్లు చాలావరకు నరికి వేయబడ్డాయి. దాంతో కిలో రెండు మూడు రూపాయలకు వచ్చే చింతచిగురు ఇప్పడు 200 రూపాయలకు చేరుకుంది. సామాన్య మద్యతరగతి వారు 20 రూపాయలు పెట్టి ఓ వంద గ్రాములు కొనుకుంటున్నారు. ఈ తరం పిల్లలకు ఆరుచి అంతగా రుచించక పోయినా పాత తరం మాత్రం ఆరోగ్యం కోసం చిహ్యచాపల్యం కోసం చింతచిగురును ఎంత ప్రియమైనా వదలలేక పోతున్నారు