TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్ప‌ట్లో స్పానిష్ ఫ్లూ ఎలా తగ్గింది? 50 మిలియన్ల మందిని చంపేశారా?

Published on: Wed May 13, 2020 12:13PM

1918లో ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని స్పానిష్ ఫ్లూ బలితీసుకుంది. దాదాపు 6,75,000 మంది అమెరికన్లు చనిపోయిన వారిలో ఉన్నారు. బ్రిటన్ దేశంలో 2.28 లక్షల మంది చనిపోయారు. స్పానిష్ ఫ్లూ సోకిన దాదాపు 50 మిలియన్ల మందిని చంపేశారని టాక్ ఉంది. వ్యాధిని అరికట్టడానికి ప్రపంచాన్ని బతికించడానికి మందులేని ఈ వ్యాధి నుంచి ఇలా మనుషుల ప్రాణాలు తీశారనే అపవాదు ప్రచారంలో ఉంది. దీనిపై అధికారికంగా మాత్రం సమాచారం లేదు.

స్పానిష్ ఫ్లూ ఎక్కువగా 20-30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లకు మాత్రమే వచ్చింది. ఆ వయసు వాళ్లకు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఉండగా.. ఈ ఫ్లూను దేశాలు పట్టించుకోలేదు. దీంతో అపార ప్రాణ నష్టం సంభవించింది. అందరినీ ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉండాలని ఆనాడు ప్రభుత్వాలు ఆదేశించాయి.

1918లో ఈ స్పానిష్ ఫ్లూ కు మందులు లేవు. చికిత్స చేయడానికి ఏలాంటి పరికరాలు లేవు. యాంటి బయాటిక్స్ కూడా లేవు. దీంతో వేలమంది చనిపోయారు. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. తుమ్ములు దగ్గుల ద్వారా ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. సబ్సుతో ముక్కు కడుక్కోవాలని సూచించింది. క్వారంటైన్ ఉండి.. మాస్కులు పరిశుభ్రత పాటించి చాలా మంది చనిపోయాక సామాజిక దూరం నిబంధలు నాడు పాటించడం వల్ల ఆ వైరస్ అంతర్థానమైంది.

ప్ర‌స్తుతం కరోనా కూడా అదే స్థాయిలో ఉంది. అప్పటి సీన్లే రిపీట్ అవుతున్నాయి. కాబ‌ట్టి పరిశుభ్రతతోనే ఈ వైరస్ ను అరికట్టడం సాధ్యం అవుతుంది.