TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాల్పుల విరమణకు అసలు కారణం ఏంటో తెలుసా?

Published on: Thu May 15, 2025 10:08AM

ఆపరేషన్ సింధూర్  కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే. అయితే భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. భారత్, పాక్ ల విషయంలో ట్రంప్ చేసిందేమీ లేదని మోడీ నిష్కర్షగా చెప్పేశారు. అయినా భారత్ అన్ని విధాలుగా అప్పర్ హ్యాండ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందా అన్న విస్మయం ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.  ఇక దేశంలో అయితే  ప్రధాని మోదీ నిర్ణయంపై భారత్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. విమర్శలూ వెల్లువెత్తాయి. 

ఇప్పుడిప్పుడే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడానికీ, కాల్పులు ఆపండి మహప్రభో అంటూ పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.  భారత్ ఆపరేషన్లలో భాగంగా పాకిస్తాన్ అణు స్థావరమైన కిరానాహిల్స్ సమీపంలోని సర్గోదా ఎయిర్ బేస్ పై క్షిపణి దాడి చేసింది. కిరానా హిల్స్ నుంచి 20 కి.మీ వరకూ సోరంగాలు ఉన్నాయి.భారత్ క్షిపణీలు సర్దోదా ఎయిర్ బేస్ పక్కన ఉన్న సోరంగంలోని అణువార్ హెడ్స్ ను తాకాయి. దాంతో   రేడియేషన్ లీక్ అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోనే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందనీ, భారత్ కు కాల్పుల విరమణకు అంగీకరించి.. రేడియేషన్ లీక్ ను ఆపుకునేందుకు తమకు  వెసులుబాటు కల్పించాలనీ బతిమ లాడుకుంది.

ఆ కారణంగానే  భారత్ కాల్పులు విరమణకు అంగీకరించిందనీ తెలుస్తోంది. రేడియేషన్ లీక్  అయ్యిందనీ, ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండేవారంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ జీవో జారీ చేసింది. ఇదే విషయాన్ని భారత్ కు తెలియజేసి కాల్పుల విరమణకు ఒప్పించిందని తెలుస్తోంది.  పాక్ పౌరుల ప్రాణ రక్షణ కోసమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందన్న ప్రశంసలూ సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుద్ధరంగ నిపుణులు భారత్ పై ప్రశంసలు కురిపించడం, భారత్ సంయమనాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు.