బంగారం ధర భారీగా తగ్గిందహో... !
Published on: Thu Aug 8, 2024 12:14PM
బంగారం ధర భారీగా తగ్గింది. ఇంకా కొద్ది రోజులు వేచి చూస్తే మరింత తగ్గుతుందేమో అనుకోకుండా, బంగారంతో అవసరం వుంటే అర్జెంటుగా షాపులకి వెళ్ళి బంగారాన్ని కొనుక్కోండి. వాన రాకడ, ప్రాణం పోకడ గురించి ఎవరూ ఎలా చెప్పలేరో బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అందుకే ముద్దు చేసినప్పుడే చంకనెక్కాలన్నట్టుగా, బంగారం ధర తగ్గినప్పుడే కొనుక్కోవడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా ఇండియాలో బంగారం ధర భారీగా తగ్గింది. బుధవారం నాడు 10 గ్రాములకు 870 రూపాయల వరకు తగ్గిన ధర, గురువారం నాడు 430 రూపాయల వరకు తగ్గింది. రెండురోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1300 వరకు తగ్గింది. శ్రావణ మాసం ప్రారంభమైంది. పెళ్ళి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో లక్ష పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ వున్న సమయంలోనే బంగారం ధర తగ్గడం ఒక వింత. గోల్డుకి ఫ్రెండ్ అయిన వెండి ధర కూడా తగ్గుతోంది.


