మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ వాచ్
Publish Date:Jan 21, 2015

ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌లో స్మార్ట్ యుగం నడుస్తోంది. సెల్ ఫోన్ రంగాన్ని స్మార్ట్ ఫోన్లు ఏలుతుంటే, మరోవైపు స్మార్ట్ వాచ్‌లు ఆ రంగంలో తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌ల రంగంలో అగ్రస్థానంలో వున్న పెబుల్ సంస్థ ఇప్పుడు తన సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి కేవలం అందమైన వాచ్‌ల్లా మాత్రమే కాదు.. స్మార్ట్ ఫోన్లలా, ఐ ఫోన్‌లా కూడా ఉపయోగపడుతుంది. మీ ఫోన్‌కి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మీ వాచ్‌కి కూడా వచ్చే ఏర్పాటు వుంది. అంతేకాదు.. ఈ వాచ్ లుక్‌ని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త వాచ్ పెట్టుకున్న అనుభూతిని పొందొచ్చు. ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలున్న ఈ వాచ్ ఖరీదు అమెరికా మార్కెట్లో 249 డాలర్లు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-pebble-steel-is-a-really-stylish-smart-watch--33-42322.html
http://www.teluguone.com/news/content/the-pebble-steel-is-a-really-stylish-smart-watch--33-42322.html