రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిజిపి
Published on: Thu Jul 11, 2024 5:06PM
రాష్ట్ర డీజీపీగా నియమితులైన జితేందర్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో మహబూబ్ నగర్, గుంటూరు ఎస్పీగా పని చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సౌలభ్యంతో పాటు రాష్ట్రంలోని శాంతిభద్రతల రక్షణలో భాగంగా కొత్త డీజిపీని నియమించింది ప్రభుత్వం. నూతన డీజీపీతో పాటు హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా రవిగుప్తా నియామించింది. ఆయన కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.


