ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ
Published on: Tue Nov 26, 2024 3:55PM
కాళేశ్వరం కమిషన్ రెండో రోజు బహిరంగ విచారణ ముగిసింది. డిజైన్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కట్టారని కమిషన్ ప్రశ్నించింది.
16 మంది ఇంజనీర్లు విచారణ కు హజరైనప్పటికీ పొంతన లేకుండా సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ సీరియస్ అయ్యింది. ఇంజనీర్ల తప్పుడు సమాధానాలతో కమిషన్ సీరియస్ అయ్యింది. క్రిమినల్ కేసులు తప్పవని కమిషన్ హెచ్చరించింది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినకాళేశ్వరం కుంగుబాటు దేశ వ్యాప్త సంచలనమైంది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ఎఈఈ డీఈఈ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది.


