TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీలో ఫ్లెక్సీ కలకలం!

Published on: Mon Dec 28, 2020 1:25PM

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఆయన పేరు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన తాతగారి లాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో రాణించగలరని, ఆయన తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణమని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే, తాజాగా ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.

 

ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చకు దారి తీసింది. ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.