TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగ్గురు సిట్టింగ్ సీఎంల తలరాతలు తారుమారు

Published on: Mon May 4, 2026 5:30PM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తలరాతలు మార్చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ప్రభుత్వాధినేత పినరయి విజయన్‌లు మాజీలుగా మిగిలిపోనున్నారు. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. అదనంగా పశ్చిమబెంగాల్‌లో ఎన్టీఏ హవా కొనసాగింది. కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఎల్‌డీఎఫ్ విజయకేతనం ఎగరవేసింది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ సారథ్యంలోని టీవీకే చెక్ పెట్టింది. 

పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ..  2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి   ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం. 

ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కరుణానిధి తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిదే విజయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల అధిపత్యాన్ని తుడిచిపెట్టింది.  దాంతో పదేళ్ల తర్వాత డీఎంకేను తిరిగి అధికారంలోకి తెచ్చిన సీఎం స్టాలిన్ మాజీగా మిగిలిపోనున్నారు.

కేరళ చరిత్రలో వరుసగా రెండు సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పినరయి విజయన్‌కు తాజా ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పలేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తూ ప్రభుత్వాన్ని మార్చేసే కేరళ ఓటర్లు సీపీఐ(ఎం)కు చెందిన విజయన్‌పై నమ్మకంతో వరుసగా రెండో సారి పట్టం కట్టారు.  2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి నుంచి గెలిచి మొదటి సారి సీఎం అయి, పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుని, తిరిగి 2021 ఎన్నికల్లో ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ క్రమంలో పినరన్ మాజీ సీఎంల జాబితాలో చేరనున్నారు.

ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, పుదుచ్చేరిల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్డీఏ సీఎంలు  హిమంత బిశ్వ శర్మ, ఎన్.రంగస్వామిలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి గెలుపొందడం విశేషం.